: భార్యకు 'సంసారం' పరీక్షలు నిర్వహించడం తప్పుకాదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు


శృంగారంలో తామెప్పుడూ పాల్గొనలేదని నిర్ధారించేందుకు భార్యకు మెడికల్ టెస్ట్‌ చేయించడం తప్పుకాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. 33 ఏళ్ల మహిళను 38 ఏళ్ల పురుషుడు 2010లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. తన భార్య సంసారానికి పనికిరాదని పేర్కొంటూ ఆయన 2011లో ఫ్యామిలీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో, 2011లో తాను ఆయనతో పలుమార్లు శృంగారంలో పాల్గొన్నానని ఆమె న్యాయస్థానికి వెల్లడించారు. ఇది నిరూపించేందుకు తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని ఆమె న్యాయస్థానానికి తెలిపారు. దీంతో జేజే ఆసుపత్రిలో ఆమెకు శారీరక, మానసిక పరీక్షలు నిర్వహించాలని జూలైలో న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమె ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన జస్టిస్ కేకే టాటెడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆమె సంసారానికి పనికొస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఈ పరీక్షలు అవసరమేనని, ఇది వ్యక్తి జీవించే హక్కు, స్వేచ్ఛను ఉల్లంఘించడం కిందికి రాదని బాంబే హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఫ్యామిలీ కోర్టులో వైద్య పరీక్షలకు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది.

  • Loading...

More Telugu News