: ప్యాకేజీ ఇచ్చినందుకు అమిత్‌షాను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ బీజేపీ నేతలు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ప్రకటించని బీజేపీపై రాష్ట్రంలో వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన ఏపీ నేతలు ఈరోజు ఢిల్లీలో పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో వారు చర్చించిన విషయం తెలిసిందే. అలాగే, కాస్సేపటి క్రితం వారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు కలసి ఆయనతో చర్చించారు. విభజన అనంతరం లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ప్యాకేజీ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.