: 20 వేల మంది చూస్తుండగా ఆమె ఎవరినైనా చంపినా... విచారణ నుంచి ఆమె తప్పించుకోగలరు: ప్రత్యర్థిపై ట్రంప్ సెటైర్


అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కుతోంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఫ్లోరిడాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, హిల్లరీ క్లింటన్‌ కి పూర్తి స్థాయి రక్షణ ఉందని అన్నారు. 20 వేల మంది ప్రజలు చూస్తుండగా ఎవరినైనా ఆమె హత్య చేసినా ఆమె ఎలాంటి విచారణ ఎదుర్కోకుండా, తప్పించుకోగలరని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఈ దేశానిది కూడా అదే పరిస్థితి అని పేర్కొన్న ఆయన, ఇలాంటి పరిస్థితిని చూస్తానని తానెప్పుడూ అనుకోలేదని విమర్శించారు. ఈమెయిల్ కుంభకోణంలో హిల్లరీని ప్రాసిక్యూట్ చేయలేకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రంప్ అలా కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News