: మహిళా మార్షల్స్ తో కొట్టించారు!...అధికార పక్షంపై వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ధ్వజం!
ఏపీ శాసనసభ చివరి రోజు సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. మహిళా మార్షల్స్ పై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణపై విపక్షానికి చెందిన మహిళా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఫైరయ్యారు. సభను స్పీకర్ 10 నిమిషాలు వాయిదా వేయగానే బయటకు వచ్చిన కల్పన అక్కడ మీడియాతో మాట్లాడుతూ... మహిళా మార్షల్స్ చేత తమపై ప్రభుత్వం దాడి చేయించిందని ఆరోపించారు. తమకు సంక్రమించిన హక్కులను సాధించుకునేందుకు ఆందోళనకు దిగిన తమను నిలువరించేందుకు 100 మందికి పైగా మార్షల్స్ ను ప్రభుత్వం సభలోకి అనుమతించిందని ఆమె పేర్కొన్నారు. అయినా సభలోకి మార్షల్స్ ను ఎలా అనుమతించారని కూడా ఆమె ప్రశ్నించారు.