: మహిళా మార్షల్స్ ను కొట్టడం సరికాదు!... వైసీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం!


ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్ వైసీపీ సభ్యుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సమావేశాల్లో పోడియంను చుట్టుముట్టిన వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... మార్షల్స్ పై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తాజాగా నేటి సమావేశాల్లోనూ ఆయన ఇదే తరహాలో మరో వ్యాఖ్య చేశారు. సభలో ఉద్రిక్త పరిస్థితులను అణచివేసేందుకు రంగంలోకి దిగిన మహిళా మార్షల్స్ పై దాడి చేయడం సరికాదని ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు.

  • Loading...

More Telugu News