: రంగంలోకి దిగిన లేడీ మార్షల్స్!...మరికాసేపట్లో వైసీపీ సభ్యులపై చర్యలే!


ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజైన నేడు సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. గడచిన రెండు రోజుల మాదిరే నల్ల రంగు చొక్కాలతో సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో ప్లకార్డులు చేతబట్టిన వారంతా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఆ పార్టీ పురుష ఎమ్మెల్యేలతో పాటు మహిళా సభ్యులు కూడా ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో అప్పటికే వైసీపీ సభ్యులను కంట్రోల్ చేసేందుకు పురుష మార్షల్స్ రంగంలోకి దిగగా, కొద్దిసేపటి క్రితం లేడీ మార్షల్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మరికాసేపట్లో వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తప్పవన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News