: ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరుపై పిఠాపురం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై టీడీపీ సీనియర్ నేత, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన వర్మ... అసెంబ్లీ ప్రాంగణంలో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు తమను పంపే విషయంలో తమ భార్యలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సమావేశాలకు హాజరు తప్పనిసరి కావడంతో భయంతోనే వణికిపోతున్న తమ భార్యలు జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తున్నారని ఆయన చెప్పారు.