: మూడో రోజూ తీరు మారని ఏపీ అసెంబ్లీ!... నల్ల దుస్తులతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైసీపీ!
ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన మూడో రోజు సమావేశాల్లో గడచిన రెండు రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని నిరసిస్తూ ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతున్న విపక్షం వైసీపీ సభ్యులు వరుసగా మూడో రోజు కూడా నల్ల రంగు చొక్కాల్లోనూ సభకు హాజరయ్యారు. అంతేకాకుండా గడచిన రెండు రోజుల మాదిరిగానే ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభ ప్రారంభమైన మరుక్షణమే గందరగోళం నెలకొంది.