: పారా ఒలింపిక్స్ లో బోణీ చేసిన భారత్!... హైజంప్ లో ‘గోల్డ్’ సాధించిన మరియప్ప!
రియో ఒలింపిక్స్ లో భారత్ సింగిల్ బంగారు పతకాన్ని కూడా సాధించలేకపోయింది. కాకలు తీరిన క్రీడాకారులంతా ఒట్టి చేతులతో తిరుగుముఖం పడుతుంటే... స్టార్ షట్లర్ పీవీ సింధు రజత పతకాన్ని సాధించగా, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించి దేశం పరువు కాపాడారు. ఇక నిన్న ప్రారంభమైన పారా ఒలింపిక్స్ లో భారత్ ఆదిలోనే సత్తా చాటింది. హైజంప్ లో తనదైన శైలిలో ప్రతిభ కనబరచిన మరియప్ప బంగారు పతకాన్ని సాధించాడు. భారత కాలమానం ప్రకారం నేటి తెల్లవారుజామున రియోలోనే జరిగిన హైజంప్ ఈవెంట్ లో మరియప్ప ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు.