: నగల కోసం యజమానిని హత్య చేసిన పనిమనిషి
నగల కోసం ఇంటి యజమానిని పనిమనిషి హతమార్చిన దారుణ సంఘటన హైదరాబాద్ చందానగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చందానగర్ లోని లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఉమాదేవి (65) అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆ ఇంటి పక్కనే వసుంధర అనే మరో మహిళ నివసిస్తోంది. ఉమాదేవి ఇంట్లో ఆమె పనిమనిషిగా చేస్తోంది. ఆమె నగలపై కన్నేసిన వసుంధర, ఆమెను కత్తితో పొడిచి హతమార్చింది. అయితే, ఈ దారుణానికి పాల్పడ్డ వసుంధర కూడా ఆ తర్వాత కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.