: గాజువాకలో కేబుల్ వైర్లు కట్ చేసిన దుండగులు... పవన్ అభిమానుల ఆగ్రహం
సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం టీవీలలో ప్రత్యక్ష ప్రసారమవుతున్న సమయంలో విశాఖపట్టణంలోని గాజువాకలో అంతరాయం ఏర్పడింది. గాజువాకలోని కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేయడంతో పవన్ ప్రసంగాన్ని చూడలేకపోయారు. దీంతో, పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కాకినాడలో నిర్వహించిన సభలో తొక్కిసలాట కారణంగా ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.