: అవంతి శ్రీనివాస్ గారూ.. రాజీనామా చేయండి, మిమ్మల్ని నేను గెలిపిస్తా: పవన్ కల్యాణ్
‘అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారూ.. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనుకుంటే మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవండి. తిరిగి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పవన్ కల్యాణ్ ది, జనసేనది. మీరు స్ఫూర్తిగా నిలిస్తే, మేము మీకు అండగా నిలబడతాము. నేను పోటీ చేయను. ప్రత్యేక హోదా కోసం ఈసారి గట్టిగా ఒత్తిడి తెండి. అప్పుడు కూడా చేయకపోతే, మనం ఏం చేయాలో ఆలోచిద్దాం’ అని పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ కల్యాణ్ పై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కాకినాడ సభ వేదికగా జనసేన పార్టీ అధినేత పైవిధంగా సమాధానమిచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తానని, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పవన్ పోరాడితే ఆయన వెనుక తాము వెళతామని గతంలో అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు పవన్ దీటైన సమాధానమిచ్చారు. తాను ఎంపీ కావాలనుకుంటే గతంలో తాను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడే అయ్యేవాడినని, తనను ఆపేవారెవరని పవన్ అన్నారు. రాజకీయాలు బాగా చేస్తారనే కదా మీలాంటి వారిని పార్లమెంట్ కు పంపించిందంటూ అవంతిపై ఆయన చురకలేశారు.