: కాశ్మీర్ వేర్పాటువాద నేత గిలానీకి తొలిషాక్ ఇచ్చిన ప్రభుత్వం


జమ్మాకాశ్మీర్ వేర్పాటు వాద నేత సయ్యద్ అలీ గిలానీకి ప్రభుత్వం తొలి షాక్ ఇచ్చింది. కాశ్మీర్ ను రావణకాష్టం చేయడంలో గిలానీ పాత్ర ప్రముఖమైనదన్న సంగతి జగమెరిగిన సత్యం. దీంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంతోనూ, కేంద్ర ప్రభుత్వంతోనూ, అఖిలపక్షంతోనూ చర్చలకు ససేమిరా అన్నారు. ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న ఆయన, సమావేశం నిర్వహిస్తున్నాము రావాలంటూ ఈ రోజు మీడియాకు సమాచారం అందించారు. దీంతో ఆయన చెప్పినట్టే ఉదయం 11 గంటలకు శ్రీనగర్ లోని ఆయన గృహ నిర్బంధంలో ఉన్న హైదర్ పొర లోని ఆయన నివాసానికి జర్నలిస్టులు చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. మీడియా సమావేశం లేదని వారికి తెలిపారు. దీంతో వారంతా అక్కడి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News