: తన వాహనాన్ని క్రాస్ చేసిన బైకర్స్ ను చితకబాదిన బీజేపీ నేత కొడుకు


స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ)లో వెళుతున్న తన వాహనాన్ని క్రాస్ చేసిన ఇద్దరు బైకర్లను బీజేపీ నేత కుమారుడు చితకబాదిన సంఘటన ఛత్తీస్ ఘడ్ లోని ఖేర్ కట్టా ప్రాంతంలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన గత నెలలో జరిగింది. బీజేపీ నేత మాంథురామ్ పవార్ కుమారుడు నన్ను పవార్ ఆగస్టు 15న ఖేర్ కట్టా ప్రాంతంలో తన మిత్రులతో కలిసి ఎస్ యూవీ లో వెళుతున్నాడు. అదేమార్గంలో వస్తున్న ఇద్దరు యువకులు వీరి వాహనాన్ని క్రాస్ చేసి వెళ్లారు. తమ వాహనాన్ని వారు క్రాస్ చేసి వెళ్లడాన్ని సహించలేకపోయిన నన్ను పవార్, వారిని దాటి వెళ్లేందుకు విఫల యత్నం చేశాడు. మరో ప్రయత్నంలో ఆ రెండు బైక్ లను దాటి వారి వాహనం ముందుకు వెళ్లింది. అనంతరం, నన్నే దాటి ముందుకు వెళ్తారా? అంటూ బైకర్లపై నన్ను పవార్ దాడి చేశాడు. అంతేకాకుండా, తన మిత్రులతో కూడా దాడి చేయించాడు. బైకర్లను చితకబాదుతున్న దృశ్యాలను వీడియో తీసి, దానిని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఈ వీడియో ఆధారంగా నన్ను పవార్, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News