: ‘కాళోజీ’ పురస్కారం అందుకున్న గోరటి వెంకన్న
కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. ఈ సందర్భంగా గోరటి వెంకన్నకు ఈ పురస్కారాన్ని అందజేశారు. పురస్కారాన్ని అందుకున్న అనంతరం వెంకన్న తన తల్లికి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులు హాజరయ్యారు.