: స్వయంగా వినాయకుడిని నిమజ్జనం చేసిన మహేష్ బాబు కొడుకు గౌతమ్... చిత్రాన్ని మీరూ చూడండి!
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్, తన ఇంట్లో పూజించిన వినాయక విగ్రహాన్ని స్వయంగా నిమజ్జనం చేస్తుండగా తీసిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ ట్రిప్ ముగిసిన తరువాత ఇండియాకు వచ్చిన మహేష్, వినాయక చతుర్థి పండగ చేసుకుని, మురుగదాస్ చిత్రం షూటింగ్ కోసం చెన్నై వెళ్లిపోగా, ఇంట్లోని వినాయకుడిని గౌతమ్, స్వయంగా దుర్గం చెరువుకు తీసుకెళ్లి నిమజ్జనం చేశాడు. తలకు కాషాయ రంగు రిబ్బన్, షార్ట్, బ్లాక్ టీ షర్ట్ ధరించి చెరువులో దిగిన గౌతమ్ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.