: ముందు విభజన చట్టాన్ని అమలు చేయండి... ఈ బోడి ప్యాకేజీలేంటి?: జేడీ శీలం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన సమయంలో చేసిన చట్టాన్ని ముందు ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్నట్టుగా రైల్వే జోన్ సహా అన్ని హామీలనూ అమలు చేయాలని, అది వదిలేసి ఎప్పుడిస్తారో, ఎలా ఇస్తారో చెప్పకుండా బోడి ప్యాకేజీలేంటని అయన ప్రశ్నించారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో మరో మాజీ మంత్రి జైరాం రమేష్ తో కలసి మీడియాతో ఆయన మాట్లాడారు. ప్యాకేజీలంటూ, లక్షల కోట్ల సాయమంటూ ప్రజలను మభ్యపెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్లు గడుస్తున్నా, చట్టంలోని అనేక హామీలింకా అమలు కాలేదని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News