: ప్యాకేజీ గురించి ముందే చంద్రబాబుకు సమాచారం... ఆయన అంగీకరించాకే ప్రకటన: వెంకయ్యనాయుడు


విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు తయారు చేసిన ప్యాకేజీ గురించి పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామని, ఆయన అంగీకరించిన తరువాతనే దాన్ని బయటకు వెల్లడించామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్యాకేజీని ఆయన స్వయంగా ఒప్పుకున్నారని, ఈ విషయంలో ఇక రాజకీయాలు చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఆపాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఏం చేయాలన్న విషయమై రూ. 1.60 లక్షల కోట్ల పనులు ఖరారయ్యాయని, మరో రూ. 65 వేల కోట్ల విలువైన పనులకు కార్యరూపాన్ని కల్పించాల్సి వుందని అన్నారు.

  • Loading...

More Telugu News