: ఇండియన్లు తెగ తిరిగేస్తున్నారట.. ఖర్చులకు కూడా వెనకాడడం లేదన్న ‘మేక్ మై ట్రిప్’


గతంతో పోలిస్తే భారత్‌లో పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. హాలీడే ట్రిప్‌లకు వెళ్తున్న వారిలో 18-24 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగినట్టు ‘మేక్‌ మై ట్రిప్’ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. పర్యాటకుల్లో 30 శాతం మంది 18-24 ఏళ్ల లోపువారేనని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది ఆరు శాతం ఎక్కువ. 400 నగరాల్లో వచ్చిన బుకింగ్స్ ఆధారంగా ‘మేక్ మై ట్రిప్’ ఈ సర్వే నిర్వహించింది. గతేడాది సగటున హాలిడే ట్రిప్ 7-9 రోజులు ఉండగా ఈసారి అది 12-14 రోజులకు చేరుకుంది. అలాగే తక్కువ దూరం పర్యటనలకు ఒక్కొక్కరు రూ.50 వేలు ఖర్చు చేస్తుండగా కాస్త సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యలో ఈ సర్వేను నిర్వహించారు. గతేడాది 59 శాతం మంది హాలిడేల కోసం విదేశాలకు వెళ్లగా ఈసారి అది 65 శాతానికి చేరుకుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ముంబై-దుబాయ్ రూట్‌ను సెర్చ్ చేయగా దేశీయంగా ఢిల్లీ-గోవా రూట్‌ను సెర్చ్ చేసినట్టు నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News