: నయీమ్ కేసులో మరో పదిమంది అరెస్టు.. 77కు చేరిన అరెస్టయిన వారి సంఖ్య
ఇటీవలే తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేసులో పలువురు నయీమ్ అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు మరో పది మందిని అరెస్టు చేశారు. వీరంతా నల్గొండ జిల్లాలోని భువనగిరిలో కిడ్నాప్లు, బలవంతపు భూముల రిజిస్ట్రేషన్లు, ఆయుధాల సేకరణ చేశారని సిట్ అధికారులు తెలిపారు. అరెస్టయిన పదిమందిలో ఒకరిని కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారిని భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం బావమరిది మహ్మద్ అష్రప్ తో పాటు అనుచరులు పూత బాలకిషన్, ఎండీ అఖిల్ పాషా, రాపోలు సుదర్శన్, జూకంటి బుచ్చయ్య, ఎండీ ఖాసీంసాబ్, సుధాకర్, వెంకటేశ్ అడ్వకేట్, శ్రీనివాస్, శ్రీధర్ రాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 77కు చేరింది. కేసులో మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.