: దళిత దంపతులతో తన ఇంట్లో పూజ చేయించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి
పూజ చేయడానికి వచ్చిన దళిత దంపతులను గ్రామ పెద్దలు ఆలయంలోకి ప్రవేశించనీయకపోవడంతో, ఆ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వారిని పిలిపించి తన నివాసంలో ఆ జంటతోనే గణపతి పూజ చేయించారు. నిన్న ఆ రాష్ట్రంలోని కొంకణ్ తీరంలోని మహాదేవాచే కెర్వాడే గ్రామంలో ఓ పండుగ జరిగింది. ఈ సందర్భంగా పూజలు నిర్వహించడానికి ఆ గ్రామంలోని హీవాలేకర్, ప్రీతమ్ దంపతులు అక్కడి గుడిలోకి ప్రవేశించాలని చూశారు. అయితే, వారిని జాట్ వర్గ పంచాయతీ పెద్దలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆ జంట గుడిముందే నిరసనకు దిగి గ్రామస్తుల వైఖరిని ఎండగట్టారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే ఈ ఘటనపై స్పందించారు. హీవాలేకర్, ప్రీతమ్‌లను వార్షాలోని తన ఇంటికి పిలిపించుకున్నారు. తమ ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ఆ జంటతో పూజ చేయించారు.