: సిరిసిల్లను అభివృద్ధి చేసి నా రుణం తీర్చుకుంటా: కేటీఆర్


రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్ల నుంచే కొనసాగుతానని, ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి తన రుణాన్ని తీర్చుకుంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లను జిల్లా చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. ‘యువకుడిగా తెలంగాణ ఉద్యమానికి నడుం కట్టిన నాకు.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి.. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు నేను గానీ, టీఆర్ఎస్ పార్టీగాని గత ఎన్నికల్లో గానీ, మ్యానిఫెస్టోలో గానీ జిల్లా ఏర్పాటు చేస్తామని ఎలాంటి వాగ్దానం చేయలేదు...’ అని ఆ లేఖలో ప్రస్తావించారు. జిల్లా అయితే జరిగే అభివృద్ధి కన్నా రెట్టింపు అభివృద్ది చేస్తానని, సిరిసిల్లలో అన్ని కార్యాలయాలు కొనసాగుతాయని, మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News