: జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదం


దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్ టీ) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై ఈరోజు ఆయన సంతకం చేశారు. దీంతో ఇక దీనిని చట్టంగా చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి దీనిని అమల్లోకి తేనున్నారు. కాగా, జీఎస్ టీ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు గత నెలలో ఆమోదం తెలిపాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు జీఎస్ టీ బిల్లుకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి.

  • Loading...

More Telugu News