: 17న వరంగల్ కు రానున్న అమిత్ షా
ఈ నెల 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వరంగల్ రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వరంగల్ లో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఈరోజు నిర్వహించిన బీజేపీ ‘తిరంగా యాత్ర’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంపై సీఎం కేసీఆర్ మాట మార్చారని అన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.