: జాతి విద్వేష వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన 'ఎయిర్ చైనా'
విమానంలోని అధికారిక మ్యాగజైన్ లో భారతీయులు, పాకిస్తానీయులు సహా నల్లజాతి వారికి దూరంగా ఉండాలంటూ జాతి విద్వేష వ్యాఖ్యలను ప్రచురించిన ఎయిర్ చైనా దిగివచ్చింది. సంస్థ అధికారిక మ్యాగజైన్ 'వింగ్స్ ఆఫ్ చైనా'లో ప్రయాణికులకు భద్రతా సూచనల్లో భాగంగా, లండన్ లో భారతీయులు, పాకిస్థానీయులు, నల్లజాతి వారు అధికంగా ఉన్న చోట ఉండవద్దని సలహాలు ఇచ్చిన విషయాన్ని చైనా మహిళా జర్నలిస్ట్ హాజ్ ఫాన్ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, ఎయిర్ చైనా ఓ ప్రకటన విడుదల చేస్తూ, క్షమాపణలు చెప్పింది. సంపాదకీయ తప్పిదాల కారణంగానే ఈ వ్యాఖ్యలు దొర్లాయని పేర్కొంది. దీన్ని చూసి అసౌకర్యానికి గురైన వారందరూ మన్నించాలని చెప్పింది.