: అమరావతి నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారమా?: హైకోర్టులో బాబు సర్కారు వాదన
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని చంద్రబాబు సర్కారు హైకోర్టులో వాదించింది. ఈ ఉదయం అమరావతి నిర్మాణం, అందుకు అవలంబిస్తున్న స్విస్ చాలెంజ్ పద్ధతిపై దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు వాదనలు విన్నారు. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి వాదనలు వినిపించారు. వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణమే లక్ష్యంగా విదేశీ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నామని ఆయన కోర్టుకు తెలిపారు. పిటిషన్లన్నీ స్వీయ ప్రయోజనాల కోసం దాఖలైనవేనని ఆరోపించారు. ఈ కేసులో వాదనలు ముగియగా, తీర్పును 12న వెలువరిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.