: పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కశ్మీర్‌లో భారత్ బుల్లెట్ల వర్షం కురిపిస్తోందంటూ వ్యాఖ్య


కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మరోమారు తన నోటి దురుసును బయటపెట్టింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో భారత్ బుల్లెట్ల వర్షం కురిపిస్తోందంటూ నోరు పారేసుకున్నారు. కశ్మీర్ ప్రజల స్వేచ్ఛా పోరాటానికి పాక్ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా చైనాతో తమ సంబంధం గురించి కూడా మాట్లాడారు. రెండు దేశాలు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నాయని, సమానత్వంతో పనిచేస్తున్నాయని అన్నారు. కశ్మీర్ ప్రజల మనోభావాలను గౌరవించాలని భారత్‌కు సూచించారు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ కశ్మీర్‌ అంశంలో తలదూర్చడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది.

  • Loading...

More Telugu News