: సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన 'కుక్క' పరుగు!
చైనాలో సెప్టెంబర్ 4న చోటుచేసుకున్న ఘటనపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిచువాన్ ప్రావిన్స్ లో ఓ బస్సును అనుసరిస్తూ ఓ కుక్క సుమారు అరగంట పాటు ఆగకుండా పరిగెత్తింది. బస్సు డ్రైవర్ కుక్కను బస్సులోకి అనుమతించకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని దీనిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, సామాజిక మాధ్యమాల్లో దీనిపై తీవ్ర స్థాయిలో స్పందనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఓ వ్యక్తి స్పందిస్తూ, ఆ సమయంలో ఆ బస్సు ప్రమాదానికి గురైనా బావుండేదని పేర్కొన్నాడు. దీనిపై కుక్క యజమానిని వివరణ కోరగా, ఆ బస్సులో తాను లేనని, బస్సులో వున్న వేరే కుక్కను చూసి అది అలా పరుగెత్తిందని తెలిపారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.