: ఇంకా ముప్ఫై ఏళ్లే కదా... అప్పుడే వయసు ఏం మించిపోయింది?: సోనమ్ కపూర్
టైటిల్ ని చదివి...పెళ్లిపై ఈ చిన్నది ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందేమిటా అని అనుకోకండి. గ్రాడ్యుయేషన్ చెయ్యడానికి ఇంకా వయసైపోలేదని చెప్పడానికే బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అలా అంటోంది. తనకున్న కోరికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ఒకటని, అయితే అది ఇంకా పూర్తి కాలేదని, దీంతో తన కల నెరవేరలేదని చెప్పింది. ఇంటర్ వరకు విద్య సక్రమంగా సాగిందని, ఆ తరువాత చదవలేకపోయానని తెలిపింది. కనీసం యూనివర్సిటీకి వెళ్లి అయినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని ఉందని సోనమ్ పేర్కొంది. ప్రస్తుతం తాను ఆ పనిలోనే ఉన్నానని, అయినా తనకు ఇప్పుడే వయసేమైపోయిందని? అంటూ నవ్వేసింది.