: 11న ఒకే వేదికపై దాసరి, చిరంజీవి
రాజమహేంద్రవరంలో 11వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి కాపునేతల సమావేశానికి చిరంజీవి, దాసరి నారాయణరావు హాజరు కానున్నారు. శ్రీకాకుళంలో కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం కాగా, కాపు నేతల సమావేశం వివరాల గురించి జేఏసీ నేతలు వెల్లడించారు. పలు రాజకీయ పార్టీల్లోని కాపు నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. కాపులకు మేలు కలిగేలా, వారిని బీసీల్లో చేర్చేలా తెలుగుదేశం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమావేశం ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు జేఏసీ ప్రతినిధి ఆకుల రామకృష్ణ తెలిపారు. కాపులతో పాటు తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను ఇతర రాష్ట్రాలు బీసీలుగా పరిగణిస్తుండగా, ఏపీలో మాత్రం ఇతర కులాల్లో ఉంచారని విమర్శించారు.