: రాజ్ నాథ్ ఇంటిలో సుజనా!... మరికాసేపట్లో జైట్లీ, వెంకయ్య కూడా!


ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో చాలా వేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాసేపటి క్రితం టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి... కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంటిలో ప్రత్యక్షమయ్యారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తుది కసరత్తులకు సంబంధించిన చర్చల కోసమే రాజ్ నాథ్ ఇంటికి సుజనా వచ్చినట్లు సమాచారం. మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా రాజ్ నాథ్ ఇంటికి రానున్నారు. ఈ నలుగురు కలిసి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన తుది కసరత్తు చేయనున్నారు. ఈ కసరత్తు ముగియగానే జైట్లీ, వెంకయ్య నార్త్ బ్లాక్ కు వెళ్లి కీలక ప్రకటన చేయనున్నారు.

  • Loading...

More Telugu News