: కేంద్రం ప్యాకేజీ 'పిండాకూడు'లా ఉంది!: సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్య
ఏపీకి కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్న ప్రత్యేక ప్యాకేజీపై టాలీవుడ్ నటుడు శివాజీ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం ఇవ్వనున్న ప్రత్యేక ప్యాకేజీ పిండాకూడులా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ రైల్వే జోన్ తో లాభాలు వస్తాయన్న ఆయన... విజయవాడలో జోన్ ఏర్పాటు చేస్తే గొడవలు ఉత్పన్నమవుతాయన్నారు. రాజధానికిచ్చే రూ.2,500 కోట్లు రోడ్లకు కూడా సరిపోవన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే... బ్యాంకు లోన్లిస్తామనడం చిప్ప చేతికివ్వడమే అని ఆయన వ్యాఖ్యానించారు.