: విశాఖ బదులు విజయవాడకు అయితేనే రైల్వే జోన్!... మెలిక పెట్టిన కేంద్రం!


ఏపీకి ప్రత్యేక హోదాకు చెల్లుచీటి ఇచ్చేసిన కేంద్రం... నేడు ఫ్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్న నేపథ్యంలో నిన్న పలు కీలక అంశాలపై ఓ స్పష్టమైన అంచనాకు వచ్చేసినట్లు తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ప్రకటించాలన్న డిమాండ్ ఏపీ నుంచి వినిపిస్తోంది. అయితే విశాఖ కాకుండా విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ప్రకటించేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు కేంద్రం చెబుతున్నట్లు సమాచారం. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కు... ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు వ్యతిరేకిస్తున్నాయని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కు ఒప్పుకుంటే అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్రం ఇప్పటికే ఏపీకి సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News