: రాహుల్ గాంధీకి రైతు సమస్యల కంటే ఫ్రాన్స్, ఇంగ్లండ్ లోని నైట్ క్లబ్బుల గురించే బాగా తెలుసు!: సుబ్రహ్మణ్య స్వామి


బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యం చేసుకున్నారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసే స్వామి, రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో దేవరియా జిల్లాలో రైతు యాత్ర చేపట్టిన సందర్భంగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో రైతుల దుస్థితి కంటే ఆయనకు యూరప్‌ లో ప్రధానంగా ఫ్రాన్స్, ఇంగ్లండ్ లలో నైట్ క్లబ్బుల గురించే బాగా తెలుసని విమర్శించారు. రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయవేత్త కాదని, అసలు రైతులకు ఎలాంటి సమస్యలు ఉంటాయో కూడా ఆయనకు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. యూరోప్ లో ఎక్కువ కాలం ఉండే రాహుల్ గాంధీ, అప్పుడప్పుడు విమానంలో ఇక్కడికొచ్చి పాదయాత్ర చేసి, మళ్లీ ఎక్కడికో వెళ్లిపోతారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News