: మహిళల శరీరం చల్లగా ఉండడానికి... మగవారి శరీరం వెచ్చగా ఉండడానికి కారణాలివే!


సాధారణంగా మహిళల శరీరం చల్లగానూ, పురుషుల శరీరం వెచ్చగాను ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం... మహిళల శరీరంలో వెచ్చటి రక్తం ప్రవహించే రక్తనాళాలు ఉపరితలానికి దూరంగా (లోతుగా) ఉంటాయి. అదే పురుషులకు మాత్రం శరీర ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి. అలాగే వేడిని ఉత్పత్తి చేసే జీవక్రియ స్త్రీల కంటే పురుషుల్లో 25 నుంచి 32 శాతం వేగంగా ఉంటుంది. దీనికి తోడు పురుషుల శరీర అమరిక, కండరాల బరువులో ఉన్న తేడాలతో పాటు, స్త్రీల చర్మం కంటే పురుషుల చర్మం కొంచెం మందంగా, చమురుగా ఉంటుంది. అంతే కాకుండా, స్త్రీల హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. దీంతో స్త్రీలలో రక్తం వేడిని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు థైరాయిడ్‌ గ్రంధి ఎక్కువ క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే స్త్రీలలో థైరాయిడ్‌ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ తేడాల కారణంగా పురుషుల కంటే స్త్రీల శరీరం చల్లగా ఉంటుంది. అదే సమయంలో పుట్టబోయే పిల్లల కోసం స్త్రీల గర్భాశయం వెచ్చగా, పురుషుల జననాంగాలు చల్లగా వుండడం అనేది సహజ సిద్ధంగా సంక్రమించిన శారీరక ధర్మమని సైన్సు చెబుతోంది.

  • Loading...

More Telugu News