: డెహ్రాడూన్‌లో లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 10 మంది మృతి.. 38 మందికి గాయాలు
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు లోయలో పడడంతో అందులోని 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ఉత్తరాఖండ్ గవర్నర్ కె.కె పాల్, ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయాలపాలయిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.