: ఢిల్లీలో బిజీబిజీగా మంత్రి హ‌రీశ్‌రావు


తెలంగాణ భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈరోజు మ‌ధ్యాహ్నం కేంద్ర మంత్రి ఉమాభార‌తితో తెలంగాణ‌లోని సాగునీటి ప్రాజెక్టుల‌పై చ‌ర్చించిన ఆయ‌న కొద్దిసేప‌టి క్రితం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆయ‌న వెంట తెలంగాణ‌ ప్ర‌భుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి కూడా ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, తెలంగాణ‌లో చేప‌ట్టిన ప్రాజెక్టులు త‌దిత‌ర అంశాల‌ గురించి హ‌రీశ్‌రావు కేంద్ర మంత్రులు, సంబంధిత అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News