: నా పిల్లలు ఫేమస్‌ కాకూడదని కోరుకుంటున్నా: ప్రఖ్యాత సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌


హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌(34) త‌న పిల్ల‌లు ఫేమ‌స్ కావ‌ద్ద‌ని కోరుకుంటుంద‌ట‌. ఆమెకు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న విష‌యం తెలిసిందే. ఆమె ఎక్క‌డికి వెళ్లినా ఆమెను త‌న అభిమానులు చుట్టుముడ‌తారు. ఆమె ఆల్బమ్స్‌కి ఎంతో డిమాండ్ ఉంది. ఈ వ‌య‌సులోనూ ఆల్బమ్స్‌ విడుదల చేస్తూనే ఉంది. ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తుంటుంది. అయితే, త‌న పిల్ల‌లు పదేళ్ల సీన్‌ ప్రెస్టన్‌, తొమ్మిదేళ్ల జేడెన్‌లు మాత్రం త‌నలా ఫేమ‌స్ కాకూడదని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పుకొస్తూ త‌న కోరిక‌కుగ‌ల కార‌ణాల‌ను పేర్కొంది. తాజాగా బ్రిట్నీ స్పియర్స్ త‌న అభిప్రాయాన్ని తెలుపుతూ... ఈ కాలం యువత అంతా త‌న పని, హోదా చూసి తాను ఎంతో ఆనందంగా ఉన్న‌ట్లు అనుకుంటార‌ని, అయితే తాను ఎన్ని భద్రతల మధ్య జీవిస్తున్నానో వారికి తెలియ‌ద‌ని ఆమె పేర్కొంది. త‌న అభిమానుల‌కు సెలబ్రిటీ లైఫ్‌ ఎలా ఉంటుందో అర్థం కాదని ఆమె చెప్పింది. సెల‌బ్రిటీలు ఎదుర్కునే ఈ ప‌రిస్థితి త‌న పిల్ల‌ల‌కు రాకూడ‌ద‌నే, అందుకే త‌న‌ పిల్లలు ఫేమస్‌ కాకూడదని తాను కోరుకుంటున్న‌ట్లు చెబుతోంది.

  • Loading...

More Telugu News