: ఈ కుర్రాడు చాలా డిఫరెంట్... రంగుల్ని వినగలడు, ధ్వనుల్ని చూడగలడు!


యూకేకి చెందిన నీల్ హర్ బిసన్ (34) ఈ ప్రపంచంలో అందర్లోకీ భిన్నమైన వ్యక్తి. ఆయన ధ్వనుల్ని చూడగలడు.. రంగుల్ని వినగలడు! దానికి కారణం, అతని బుర్రలో అమర్చిన కృత్రిమ యాంటెనా. చిన్నతనంలో కలర్ బ్లైండ్ నెస్ తో బాధపడిన నీల్ ను ఆ సమస్య నుంచి దూరం చేసేందుకు అతని తల్లిదండ్రులు వైద్యుల సాయంతో 2004లో అతని మెదడులో యాంటెనాను అమర్చారు. ఇందులోని సెన్సార్స్‌ అతను అన్నింటినీ చూడగలిగేటట్లు చేస్తాయి. ఆ యాంటెన్నా సాయంతో నీల్‌ వర్ణాల్ని విని, ధ్వని తరంగాలను చూడగలుతున్నాడు. అంతే కాదు, ఆ యాంటెనా సాయంతో ఉపగ్రహ సిగ్నల్స్‌ ను కూడా ఆపరేట్‌ చేయగలగడం విశేషం. అతని బుర్రలో అమర్చిన యాంటెనాతో ఇంటర్నెట్‌, ఫోన్‌ కాల్స్‌ తదితర సాంకేతిక సదుపాయాలను సులభంగా ఆపరేట్‌ చేయగలడు. హాలీవుడ్‌ సినిమాలలోలా అతను చూసే ఏ అంశాన్నైనా యాంటెనాతో ఇట్టే స్కాన్‌ చేసేస్తాడు. దీనిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నీల్‌ సొంతంగా సైబార్గ్‌ అనే సంస్థను స్థాపించాడు. దీంతో వివిధ ప్రాంతాల్లో ఔత్సాహికులకు అవగాహన కల్పించి సత్తా చాటుతున్నాడు. తన సంస్థ ద్వారా లండన్‌ లో జరిగే అన్ని ఫ్యాషన్‌ షోస్‌ లో, యూనివర్సిటీలలో, ఇతర వేదికలపై తన ‘యాంటెనా విజన్‌ ఆర్ట్‌’ గురించి ప్రసంగాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News