: టీచర్ అవతారం ఎత్తిన రాష్ట్రపతి!... ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెప్పిన ప్రణబ్!
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి రోజే ఉపాధ్యాయ దినోత్సవం రావడంతో ఈ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రణబ్... ఇంటర్ విద్యార్థులకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్ లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయంలోని 11, 12వ తరగతుల విద్యార్థులకు ప్రణబ్ పాఠాలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నేటి ఉదయం 10.30 గంటలకు దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.