: ఖైరతాబాద్ గణనాథుడికి మరికొద్ది సేపట్లో గవర్నర్ దంపతుల తొలి పూజలు
ఖైరతాబాద్‌లో కొలువైన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి గవర్నర్ దంపతులు మరికొద్ది సేపట్లో తొలిపూజలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఖైరతాబాద్ చేరుకుని భారీ గణపతికి పూజలు నిర్వహిస్తారు. ఆయన రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూజల అనంతరం భక్తులను ఉద్దేశించి గవర్నర్ దాదాపు అరగంట పాటు ప్రసంగించనున్నారు. మరోవైపు 58 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విష్ణు రూపంలో, వెనకవైపున శివలింగంతో ఈ భారీ గణనాథుడిని తీర్చి దిద్దారు. వినాయకుడిని దర్శించుకునేందుకు ఆదివారం నుంచే భక్తులు పోటెత్తారు. దీంతో తోపులాటలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.