: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఒలింపిక్ పతక విజేత సింధు, గోపీచంద్


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ సందడి చేశారు. ఈ ఉదయం వీరు స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, గోపీచంద్‌తో కలిసి శనివారం రాత్రే తిరుమల చేరుకున్న సింధు ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు వీరికి సాదరంగా ఆహ్వానం పలికారు. దర్శనానంతరం సింధు స్వామి వారికి 68 కిలోల బెల్లాన్ని తులాభారం ద్వారా సమర్పించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News