: విడుదలకు ముందే రూ. 60 కోట్లు రాబట్టిన ధోనీ బయోపిక్
భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ జీవితంపై తీసిన బయోపిక్ 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' విడుదలకు ముందే రూ. 60 కోట్లను రాబట్టింది. మొత్తం చిత్రాన్ని నిర్మించేందుకు రూ. 80 కోట్లు ఖర్చు కాగా, శాటిలైట్ హక్కుల విక్రయం ద్వారా రూ. 45 కోట్లు, చిత్రంతో డీల్స్ కుదుర్చుకున్న పలు కంపెనీల ద్వారా రూ. 15 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ధోనీ జీవితంలో ఎవరికీ తెలియని పలు సంఘటనలను చిత్రంలో కూర్చడంతో పాటు, ఆయన టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో, రాంచీలోని ధోనీ ఇంట్లో కూడా చిత్రాన్ని షూట్ చేశారు. ఈ చిత్రం ఈ నెల 30న వెండితెరను తాకనున్న సంగతి తెలిసిందే.