: గణనీయంగా తగ్గిన హిల్లరీ ఆధిక్యం... దూసుకొస్తున్న ట్రంప్!
అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ కు జనాదరణ తగ్గుతోంది. నెల రోజుల క్రితం ఆమెకున్న ఆధిక్యంతో పోలిస్తే, ప్రస్తుతం మద్దతు తగ్గిపోయింది. అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దూసుకొచ్చేశాడు. తాజా సర్వేలో హిల్లరీకి 42 శాతం మంది మద్దతిస్తుండగా, ట్రంప్ కు 37 శాతం మంది మద్దతిస్తున్నట్టు తేలిందని సీఎన్ఎన్ వెల్లడించింది. ఇద్దరి మధ్యా తేడా 5 శాతమేనని, మరో 3 శాతం మంది ట్రంప్ వైపు వస్తే, ఆయన తొలిసారిగా ఆధిక్యంలోకి వస్తారని పేర్కొంది. గడచిన నెల రోజుల వ్యవధిలో ట్రంప్ పై హిల్లరీ ఆధిక్యం 4.1 శాతం తగ్గిందని సర్వే నిర్వహించిన మరో రాజకీయ సంస్థ రియల్ క్లియర్ పాలిటిక్స్ వెల్లడించింది. వైట్ హౌస్ కు చేరే క్రమంలో ఇద్దరి మధ్యా తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపింది. ఫ్లోరిడా, ఓహియో, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, విస్కాన్సిస్, మిచిగాన్, నెవడా, కొలరాడో, వర్జీనియా, జార్జియా రాష్ట్రాల్లో హిల్లరీకి ఆధిక్యం ఉండగా, మిగతా రాష్ట్రాల్లో ట్రంప్ ముందున్నారని పేర్కొంది.