: విజయవాడ మేయర్ పై మరోసారి వైఎస్సార్సీపీ ఆరోపణ
విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ పై మరోసారి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు. శ్రీధర్ తన మేయర్ పదవిని అడ్డుపెట్టుకుని తన భార్య కోనేరు రమాదేవి డైరైక్టర్ గా ఉన్న కేఎంకే సంస్థకు కాంట్రాక్ట్ లు అప్పజెబుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల ఆరోపించారు. మేయర్ భార్య సంతకంతో ఉన్న బిల్లులను ఆమె బయటపెట్టారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగ మేనని, మేయర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోనేరు శ్రీధర్ తన పదవికి రాజీనామా చేయకుంటే, ఈ బిల్లుతో ఆందోళనలు చేపడతామని పుణ్యశీల హెచ్చరించారు.