: తెలంగాణలో పోలీసు కానిస్టేబుళ్ల నియామక తుది రాతపరీక్ష తేదీ ఖరారు
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (పీఆర్‌బీ) పోలీసు కానిస్టేబుళ్ల నియామక తుది రాతపరీక్ష తేదీను ఖరారు చేసింది. వచ్చేనెల 23న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. కొన్ని రోజుల క్రితం పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 9,613 కానిస్టేబుల్ పోస్టులకు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల్లో పాల్గొన్న అభ్యర్థుల్లో 81 వేల మంది అర్హత సాధించారు. తుది పరీక్ష ద్వారా అభ్యర్థులను నియామకాలకు ఎంపిక చేయనున్నారు. వచ్చేనెల 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది.