: రూ.60 కోట్లు దాటిన విజయసాగర్ బాబు అవినీతి!... గుంటూరు ఆంధ్రా బ్యాంకు లాకర్ లోనూ నోట్ల కట్టలు!


ఏపీ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయసాగర్ బాబు అవినీతి సంపద రూ.60 కోట్లకు పెరిగింది. ఇప్పటికే విజయవాడలోని నున్న, కర్నూలు జిల్లా శ్రీశైలంలోని టెంపుల్ శాఖల్లోని సాగర్ బాబు లాకర్లలో పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు ఆంధ్రా బ్యాంకు శాఖలోని లాకర్ ను కూడా ఏసీబీ అధికారులు తెరిచారు. ఈ లాకర్ లో రూ.49 లక్షలకు పైగా విలువ చేసే నోట్ల కట్టలతో పాటు రూ.2 కోట్ల విలువ చేసే ఆస్తుల పత్రాలు కూడా లభ్యమయ్యాయి. ఇప్పటిదాకా వెలుగుచూసిన సాగర్ బాబు అక్రమ సంపాదన రూ.60 కోట్లకు పైమాటేనని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News