: అగ్రిగోల్డ్ బాధితులతో సీఐడీ భేటీ!... సమస్యలపై ఆరా తీసిన ఖాకీలు!
అగ్రిగోల్డ్ మాయతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితుల పట్ల ఏపీ సర్కారు కనికరం చూపింది. ఇప్పటికే అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు... తాజాగా కాసేపటి క్రితం బాధితులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఈ భేటీలో బాధితులతో కాస్తంత ఆప్యాయంగా మాట్లాడిన పోలీసులు... వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వీలయినంత త్వరలో డిపాజిట్లను ఇప్పించేందుకు యత్నిస్తామని పోలీసులు చెప్పడంతో బాధితులకు సాంత్వన లభించింది.