: కశ్మీర్ సమస్యను పటేల్ కు అప్పగించి ఉంటే... ఇప్పుడు సమస్యే ఉండేది కాదు: వెంకయ్యనాయుడు


భారత ప్రప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని కేబీఆర్ పార్కులో కాసేపటి క్రితం మొదలైన తిరంగా యాత్రను ప్రారంభించిన సందర్భంగా వెంకయ్య కీలక ప్రసంగం చేశారు. జాతీయ సమైక్యతా భావాన్ని అందరూ అలవరచుకోవాలని పిలుపునిచ్చిన ఆయన... సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కశ్మీర్ లో కొనసాగుతున్న కల్లోల పరిస్థితులను ప్రస్తావించిన వెంకయ్య... కశ్మీర్ అంశాన్ని పటేల్ కు అప్పగించి ఉంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు ఉత్పన్నమయ్యేవే కావని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంపొందించేందుకే తాము తిరంగా యాత్రను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News