: ఈ చిత్రానికి మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానుల విషెస్ కావాలి: దర్శకుడు బాబీ
‘సిద్ధార్థ’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని దర్శకుడు బాబీ అన్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న బాబీ మాట్లాడుతూ, ‘టీజర్ లాంచ్ చేసింది చిరంజీవి గారి పుట్టినరోజు అయిన ఆగస్టు 22 నాడు, ఈ చిత్రం ఆడియోనేమో పవన్ కల్యాణ్ గారి పుట్టిన రోజు నాడు విడుదల చేస్తున్నారు. కనుక, ఆ ఇద్దరి హీరోల అభిమానుల విషెస్ ఈ చిత్రానికి ఉంటాయని నేను కోరుకుంటున్నాను’ అన్నారు. బుల్లితెర హీరో సాగర్ సినిమాల్లోకి వస్తుంటే బాగుంటుందని తామందరం అనుకున్నామన్నారు. ‘మిస్టర్ పర్ఫెక్టు’ చిత్రంలో హీరో ప్రభాస్ ఫ్రెండ్ గా యాక్టు చేయమని రిక్వెస్ట్ చేస్తే, ఈ చిత్రంలో నటించాడని బాబీ అన్నారు.